రాక్షస పాలన రాష్ట్రంలో పోయింది కానీ, విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ లో పోలేదు
రాక్షస పాలన రాష్ట్రంలో పోయింది కానీ, విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ లో పోలేదు
యువగళం పాదయాత్ర ద్వారానే రాష్ట్రం రాక్షస పాలన నుంచి విముక్తి పొందింది
ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి
విజయవాడ,జనవరి 27,(వెలుగు నాడు ప్రతినిధి) : విజయవాడ,రాష్ట్ర ప్రజలు రాక్షస పాలన నుంచి విముక్తి పొందినప్పటికీ, విజయవాడ నగర అభివృద్ధిని అడ్డుకునే అదే విధమైన అడ్డంకులు విజయవాడ మున్సిపల్ కౌన్సిలో ఇంకా కొనసాగుతున్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో రూ.13 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, 4వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు శంకుస్థాపన చేశారు.అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ యువనేత మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నేటితో మూడేళ్లు పూర్తవుతున్నాయని గుర్తు చేశారు. యువగళం పాదయాత్ర ద్వారానే రాష్ట్రం రాక్షస పాలన నుంచి విముక్తి పొందిందని, ఆ పాదయాత్రలో ప్రజల నుంచి నేరుగా తెలుసుకున్న సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్‌కు విజయవాడ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.నగర అభివృద్ధికి సంబంధించిన కీలకమైన డీపీఆర్‌లను మున్సిపల్ కౌన్సిల్ తిరస్కరించడందురదృష్టకరమన్నారు. విజయవాడ అభివృద్ధికి మున్సిపల్ కౌన్సిల్ అడ్డుగోడగా మారిందని విమర్శించారు.విజయవాడ నగరంలో త్రాగునీరు, డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ వంటి మౌలిక వసతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వీటికి శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నామని ఎంపీ తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు డీపీఆర్‌లు అందుబాటులోకి రానున్నాయని, అవి అందిన వెంటనే నగరంలో నెలకొన్న ప్రధాన సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాలు చూపిస్తామని హామీ ఇచ్చారు.రాణిగారి తోట వద్ద అండర్‌పాస్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తైందని, అలాగే కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో విజయవాడకు సంబంధించిన జాతీయ రహదారులు, రైల్వే సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.విజయవాడ అభివృద్ధికి అవసరమైన డీపీఆర్‌లు సిద్ధమైన వెంటనే, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి మూడు వేల కోట్ల రూపాయల నిధులు కోరనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ గ్రేటర్ అయ్యేలోపు నగరంలో ఉన్న అన్ని మౌలిక వసతుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ యువగళం పాదయాత్ర ద్వారానే రాష్ట్రం అరాచక పాలన నుంచి విముక్తిపొందిందన్నారు. విజయవాడ సుందరీకరణ, అభివృద్ధి కోసం ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని కొనియాడారు. మున్సిపల్ కౌన్సిల్‌లో ఉన్న వైసీపీ సభ్యులు అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ ప్రతి పనిని జాప్యం చేస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి అవసరమైన నిధులు ఎన్ని వేల కోట్లైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.కార్పొరేటర్ జాస్తి సాంబశివరారవు మాట్లాడుతూ గ్రేటర్ విజయవాడ కావాలనేది.విజయవాడ ప్రజల చిరకాల కోరిక అని తెలిపారు. ఇందుకోసం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు. విజయవాడను గ్రేటర్ చేయటానికి సీఎం చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ నగర పాలక సంస్థ లో వైసిపి అదికారం చేపట్టిన నాటి నుంచి విజయవాడ లో ఒక అభివృద్ది పనిజరగలేదన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం లో సీఎం చంద్రబాబు నాయకత్వంలో అధికారులు సహకారంతో విజయవాడ అభివృద్ది జరుగుతోందన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ వడ్లపట్ల గోపాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎమ్ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బాయనవెంకటరావు, , సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ ప్రెసిడెంట్ చనుములు సురేష్, కాలనీవాసులు మండవ వెంకటేశ్వరరావు కొర్రపాటి సురేంద్ర, టిడిపి నాయకులు యెర్నేని వేదవ్యాస్, ఈఈ సామ్రాజ్యం, ఎ.ఈ దీక్షిత్ లతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0