భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో రైస్ బ్యాగ్ సరుకులు కూరగాయలు పళ్ళు ఫలహారాలు వితరణ

Jun 1, 2026 - 20:20
 0  5
భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో రైస్ బ్యాగ్ సరుకులు కూరగాయలు పళ్ళు ఫలహారాలు వితరణ

భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో రైస్ బ్యాగ్ సరుకులు కూరగాయలు పళ్ళు ఫలహారాలు వితరణ.

తిరువూరు జూన్ 01, (వెలుగు నాడు ప్రతినిధి) : పాత కొండూరు గ్రామానికి చెందిన వెంపాటి కిషోర్ సంధ్య దంపతుల ముద్దుల తనయ హన్విక పుట్టినరోజు సందర్భంగా హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో మానవ సేవే మాధవ సేవగా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని తమ వంతు సహాయంగా పట్టణ పరిధిలోని జన్మభూమి రోడ్ లో గల భగవాన్ శ్రీ రమణ మహర్షి అంధులు మానసిక వికలాంగులు అనాధ బాలల సేవా ఆశ్రమం లో రైస్ బ్యాగ్ & నిత్యవసర సరుకులు, కూరగాయలు, పళ్ళు పలహారాలు ఆశ్రమ నిర్వాహకులు వెంపాటి అబ్రహం మణిరత్నం కు వితరణగా అందజేశారు.ఆశ్రమ నిర్వాహకులు అబ్రహం మణిరత్నం చిన్నారి హన్విక కు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంపాటి కిషోర్, పొద్దుటూరి హర్ష, వెంపాటి రాజు, హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ & సమైక్య ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మద్దిబోయిన నరేష్,మాదాసు టైటాస్ (సామాజిక కార్యకర్త), ఆళ్ల నారాయణ పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్