పరిపూర్ణ బాలల ఆశ్రమంలో అన్నదానం చేసిన డాక్టర్ చెన్నారెడ్డి దంపతులు

Jun 15, 2026 - 00:25
 0  8
పరిపూర్ణ బాలల ఆశ్రమంలో అన్నదానం చేసిన డాక్టర్ చెన్నారెడ్డి దంపతులు

పరిపూర్ణ బాలల ఆశ్రమంలో అన్నదానం చేసిన డాక్టర్ చెన్నారెడ్డి దంపతులు

తిరువూరు జూన్ 14, (వెలుగు నాడు ప్రతినిధి) : తిరువూరు పట్టణంలోని బైపాస్ రోడ్, సూర్యా రెస్టారెంట్ పక్కన ఉన్న పరిపూర్ణ బాలల ఆశ్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ చెన్నారెడ్డి, నళిని దంపతులు తమ కుమారుడు సాయి మోక్షిత్ రెడ్డి, కుమార్తె అశ్రీతా రెడ్డితో కలిసి చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.సమాజంలో అనేక మంది అవసరంలో ఉన్నప్పటికీ, అనాథ చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో డాక్టర్ చెన్నారెడ్డి దంపతులు ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. గతంలో కూడా ఆశ్రమానికి కూలర్‌ను అందించడంతో పాటు, ఆశ్రమ నిర్వహణ కోసం అద్దె చెల్లింపులకు ఆర్థిక సహాయం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు చూడడమే మా ఆనందం" అనే భావనతో ఆశ్రమాన్ని సందర్శించిన ప్రతిసారి వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. అనాథ పిల్లలను సొంత పిల్లలుగా భావించి వారి సంక్షేమం కోసం ఆలోచించడం నిజంగా అభినందనీయం.ఈ సందర్భంగా చిన్నారులతో ఆప్యాయంగా గడిపిన డాక్టర్ చెన్నారెడ్డి కుటుంబ సభ్యులకు పరిపూర్ణ బాలల ఆశ్రమం చిన్నారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఆశ్రమ నిర్వాహకులు సిరికొండ నాగేశ్వరరావు (అభి), వరలక్ష్మి దంపతులు వారి సేవా దృక్పథాన్ని కొనియాడుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.సమాజంలో ఇలాంటి దాతలు మరెందరో ముందుకు వచ్చి అనాథ చిన్నారులకు అండగా నిలవాలని వారు ఆకాంక్షించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్