కెవికె లో డాక్టర్ కె ఎల్ రావు వర్ధంతి 

May 19, 2026 - 11:44
 0  6
కెవికె లో డాక్టర్ కె ఎల్ రావు వర్ధంతి 

కెవికె లో డాక్టర్ కె ఎల్ రావు వర్ధంతి 

జగ్గయ్యపేట మే18, (వెలుగు నాడు ప్రతినిధి) : ప్రఖ్యాత ఇంజనీర్, భారతదేశ జల నిర్వహణ పితామహుడు' డాక్టర్ కె ఎల్ రావు (15 జూలై 1902 - 18 మే 1986) వర్ధంతిని గరికపాడులోని వారి పేరుగల కృషి విజ్ఞాన కేంద్రం (కెవికె) లో సోమవారం నిర్వహించారు.డాక్టర్ ఎం రవి కిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ ప్రభావతి మాట్లాడుతూ, నాగార్జున సాగర్, భాక్రా నంగల్ వంటి భారీ డ్యామ్‌ల నిర్మాణం, నదుల అనుసంధాన ప్రతిపాదన,కేంద్ర మంత్రిగా దేశ జల, విద్యుత్ విధానాలకు ఆయన చేసిన విశేష సేవలను గుర్తుచేశారు.దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1963 లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిందని, ఆంధ్ర, రూర్కీ, జె ఎన్ టీ యూ విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారని తెలిపారు. వ్యవసాయ రంగానికి ఆయన చేసిన కృషికి కృతజ్ఞతగానే సంస్థకు ఆయన పేరు పెట్టడం గర్వకారణమని అన్నారు.ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్