యువకుల ర్యాష్ డ్రైవింగ్ వృద్దురాలికి తీవ్ర గాయాలు

Feb 28, 2026 - 00:44
 0  1
యువకుల ర్యాష్ డ్రైవింగ్ వృద్దురాలికి తీవ్ర గాయాలు

యువకుల ర్యాష్ డ్రైవింగ్ వృద్దురాలికి తీవ్ర గాయాలు

జగ్గయ్యపేట ఫిబ్రవరి 27 (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేటలోని బలుసుపాడు రోడ్డులో పాత వేంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో శుక్రవారం యువకులు అతివేగంగా బైక్ నడుపుతూ వృద్ధురాలిని ఢీ కొట్టి పరారయ్యారు. సమీపంలో ఉన్న యువకుడు సోమేశ్వరరావు స్పందించి ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసుకు సమాచారం అందించారు.ఆయన సమీపంలో ఉన్న వారి సాయంతో క్షతగాత్రురాలిని 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మైనర్లు, యువకుల ట్రిపుల్ రైడింగ్,రాష్ డ్రైవింగ్ లతో పట్టణ ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్