త్రినయ్ ఆర్థోపెడిక్ సెంటర్ వారిచే ఉచిత వైద్య శిబిరం

Jan 26, 2026 - 02:21
 0  6
త్రినయ్ ఆర్థోపెడిక్ సెంటర్ వారిచే ఉచిత వైద్య శిబిరం

త్రినయ్ ఆర్థోపెడిక్ సెంటర్ వారిచే ఉచిత వైద్య శిబిరం

జగ్గయ్యపేట జనవరి25 ( వెలుగు నాడు ప్రతినిధి): పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఆధ్వర్యంలో, త్రినయ్ ఆర్థోపెడిక్ సెంటర్ వారి సౌజన్యంతో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు.ముఖ్యంగా ఎముకల సమస్యలు, మోకాళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి నిపుణ వైద్యుల ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ కొండయ్య, ఎల్ ఎస్ సీ ఎస్ సొసైటీ చైర్మన్ ధూళిపాళ్ల లక్ష్మణరావు, కౌన్సిలర్ నకిరకంటి వెంకట్, మాజీ కౌన్సిలర్ మారేపల్లి శౌరి, డాక్టర్ దినేష్ సుంకర, డాక్టర్ కళింగ వర్మ, గండ్రాయి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లెబోయిన నాగరాజు, ముసునూరి పవన్,, త్రినయ్ ఆర్థోపెడిక్ సెంటర్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్