సహకార సంఘాల ఉద్యోగుల నిరవధిక సమ్మె

Feb 24, 2026 - 23:25
 0  3
సహకార సంఘాల ఉద్యోగుల నిరవధిక సమ్మె

సహకార సంఘాల ఉద్యోగుల నిరవధిక సమ్మె

 9వ రోజు డిమాండ్ల అమలుపై గట్టిగా పోరాటం

తిరువూరు ఫిబ్రవరి 24, (వెలుగు నాడు ప్రతినిధి ) : తిరువూరులో సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళన కొనసాగిస్తున్నారు.ఉద్యోగులు జీవో నెంబర్ 36 ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2019 నుండి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించడంతో పాటు ఉద్యోగ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.అదనంగా, ప్రతి ఉద్యోగికి కనీసం రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. 2019 తరువాత సహకార సంఘాలలో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డివిడెండ్లను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.తమ సమస్యలు పరిష్కరించేవరకు సమ్మెను విరమించబోమని ఉద్యోగులు స్పష్టం చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్