అనాధ బాలలను ఆదుకోవడం మనందరి బాధ్యత: ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. హిమబిందు

Jan 31, 2026 - 22:28
 0  3
అనాధ బాలలను ఆదుకోవడం మనందరి బాధ్యత: ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. హిమబిందు

అనాధ బాలలను ఆదుకోవడం మనందరి బాధ్యత: ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. హిమబిందు

జగ్గయ్యపేట,జనవరి31, (వెలుగు నాడు ప్రతినిధి ) : మండల లీగల్ సెల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక విజ్ఞాన్ విద్యాసంస్థల్లో హైస్కూల్ విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. హిమబిందు.మాట్లాడుతూ, తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని విద్యార్థులకు తెలియజేశారు. అలాగే బాలికలు వివిధ ప్రదేశాల్లో ఎదుర్కొనే లైంగిక వేధింపులను ఎలా ఎదుర్కోవాలి, తమను తాము ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, బాల్య వివాహాలునిర్వహించినట్లయితే వధూవరుల తల్లిదండ్రులతో పాటు వివాహం జరిపించే పురోహితుడిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. విద్యాసంస్థల డైరెక్టర్ తన్నీరు సుధారాణి మాట్లాడుతూ, అనాధ బాలలను చేరదీయడం, బాల్య వివాహాలను అరికట్టడం వంటి అంశాల్లో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి తమ విద్యాసంస్థ కట్టుబడి ఉంటుందని తెలిపారు.ఎక్కడైనా ఇలాంటి ఘటనలు తమ దృష్టికి వస్తే వాటిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మండల లీగల్ సెల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నత హోదాలో ఉన్న న్యాయమూర్తి అవగాహన సదస్సు నిర్వహించడం, తమ విద్యాసంస్థను ఎంపిక చేయడం గర్వకారణమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నెపాగ సుందరరావు, న్యాయవాది దాసరి నాగేశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపాల్ అలెక్స్ జోసెఫ్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్