స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం తీర్మానం
స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం తీర్మానం
జగ్గయ్యపేట జనవరి30 ( వెలుగు నాడు ప్రతినిధి)జగ్గయ్యపేట పురపాలక సంఘం గ్రేడ్ 2 నుంచి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం తీర్మానించింది.శుక్రవారం చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ 82 వేలకు పైగా జనాభా కలిగి, 12 కోట్లకు పైగా వార్షికాదాయాన్ని కలిగిన పురపాలక సంఘం స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి కావలసిన అన్ని అర్హతలు ఉన్నందున స్థాయోన్నతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.జగ్గయ్యపేట ఆటోనగర్, ఇండస్ట్రియల్ పార్క్ తొర్లగుంటపాలెం ప్రాంతాలను విలీనం చేసిన తర్వాత జనాభా, ఆదాయం పెరిగినట్లు చైర్మన్ వివరించారు.అధికారుల సమావేశానికి హాజరు కాకపోవటంపై సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. కమిషనర్ తో పాటు, మేనేజర్ ఇతర విభాగాల అధికారులు ఎవరూ సమావేశానికి హాజరు కాకపోవటం పై చైర్మన్ రాఘవేంద్రతోపాటు, వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల్లో పనులకు శంకుస్థాపన చేసిన నెలలు గడుస్తున్నా ప్రారంభించ లేదని, మున్సిపల్ డిఈ అందుబాటులో ఉండటం లేదని సభ్యులు, చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం పది రోజుల్లో అన్ని పనులు పూర్తి చేయిస్తానని డీఇ శివ కోటేశ్వరరావు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.వేపల వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని తాత్కాలిక మరమ్మ తులు తో ప్రయోజనం లేదని వైసిపి కౌన్సిలర్ వట్టెం మనోహర్ తో పాటు వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ సమావేశంలో ప్రస్తావించారు.పట్టణ శివారు ఆటోనగర్లో ఉన్న కాలుష్య కారక కర్మాగారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని,ఈ కర్మాగారాలను మూసివేయడానికి ప్రభుత్వం నుంచి తక్షణ చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు.ఈ విషయంపై తగు చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ వివరించారు.సచివాలయాల పనితీరు బాగోలేదని కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.మున్సిపల్ అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని అధికారులపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
1