జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు
జగ్గయ్యపేట ఫిబ్రవరి 26 (వెలుగు నాడు ప్రతినిధి) : పట్టణంలో జనసేన పార్టీ సభ్యత్య నమోదు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.తొలి సభ్యత్వం ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను తనయుడు సామినేని ప్రసాద్ బాబు నమోదు చేసుకున్నారు. అనంతరం ప్రసాద్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి పల్లె, ప్రతి వార్డులో జనసేన సిద్ధాంతాలను నమ్మే సైనికులను ఏకం చేసే దిశగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.పార్టీ కోసం శ్రమించే కార్యకర్తల క్షేమమే ధ్యేయంగా, ప్రతి క్రియాశీలక సభ్యునికి రూ 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని పార్టీ కల్పిస్తోంది అన్నారు. ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని పార్టీ నిధి నుండే చెల్లిస్తారని తెలియజేసి ఇందుకోసం ఇప్పటికే తన వంతుగా రూ.2 కోట్ల భారీ విరాళాన్ని పార్టీకి అందజేసినట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0