విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్న కర్లపాటి వెంకట శ్రీనివాసరావు

Jan 27, 2026 - 01:00
 0  13
విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్న కర్లపాటి వెంకట శ్రీనివాసరావు

విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్న కర్లపాటి వెంకట శ్రీనివాసరావు

జగ్గయ్యపేట,జనవరి26, (వెలుగునాడు ప్రతినిధి):కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ కె. బాలాజీ చేతుల మీదుగా, 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి కార్యక్రమంలో అంబుడ్స్ పర్సన్ – ఎం.జి.నరేగా గా విశిష్ట సేవలు అందించినందుకు కర్లపాటి వెంకట శ్రీనివాసరావు కి మెరిటోరియస్ అవార్డు ప్రదానం చేశారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత, బాధ్యత, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిష్పక్షపాత వైఖరి, అవినీతి నివారణలో కీలక పాత్ర పోషించినందుకు ఆయన సేవలను గుర్తిస్తూ ఈ అవార్డు అందజేశారు.అంబుడ్స్ పర్సన్‌గా విధులు నిర్వహిస్తున్న కాలంలో ప్రజలకు న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేశారని పలువురు అధికారులు ప్రశంసించారు.ఈ సందర్భంగా కర్లపాటి వెంకట శ్రీనివాసరావు మాట్లాడుతూ,ఈ అవార్డు తనకు మాత్రమే కాకుండా, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పని చేస్తున్న ప్రతి సామాజిక కార్యకర్తకు దక్కిన గౌరవమన్నారు . భవిష్యత్తులో కూడా మరింత నిబద్ధతతో, నిజాయితీతో ప్రజాసేవ కొనసాగిస్తాననీ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ఏపీ సాట్ డైరెక్టర్ శ్రీకాంత్ ,డ్వామా పీడీ శివప్రసాద్ యాదవ్, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ మాజీ ప్రభుత్వ విప్, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను , జగ్గయ్యపేట వైఎస్ఆర్సిపి నియోజకవర్గ కన్వీనర్ తన్నీరు నాగేశ్వరరావు , సామినేని రాము, డాక్టర్ ఎన్ అనిల్ కుమార్ , ముల్లంగి రామకృష్ణారెడ్డి , ట్రస్ట్ ప్రతినిధులు రాయపూడి వెంకటేశ్వరావు పారాల రాము తదితరులు కర్లపాటిని అభినందించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్