విజ్ఞాన కేంద్రాలు అనేక విధాలుగా సమాజ అభివృద్ధికి తోటపాటు నందిస్తాయి
విజ్ఞాన కేంద్రాలు అనేక విధాలుగా సమాజ అభివృద్ధికి తోటపాటు నందిస్తాయి
వత్సవాయి, జనవరి 21, (వెలుగు నాడు ప్రతినిధి) : వత్సవాయి మండల కేంద్రంలో బొగ్గవరపు వెంకటేశ్వర్లు విజ్ఞాన కేంద్రంకి వంద కుర్చీలను విరాళంగా ఇచ్చారు ఈ సందర్భంగా చిట్టూరి జనార్ధన్ మాట్లాడుతూ వత్సవాయి మండలంలో ఇటువంటి విజ్ఞాన్ కేంద్రం కట్టడం ఎంత ఆనందంగా ఉందని ఈ విజ్ఞాన కేంద్రం అందరికీ ఉపయోగపడుతుందని అందరూ ఉపయోగించుకోవాలని గతంలో డిఎస్సీ అవగాహన సదస్సు కూడా నిర్వహించారాని భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలు కూడా నిర్వహించాలని నా వంతుగా విజ్ఞాన కేంద్రానికి సహకారం అందిస్తున్నారని తెలియజేశారు విజ్ఞాన కేంద్రానికి సహకారం అందించిన చిట్టూరి జనార్ధన్ గారిని ట్రస్ట్ కమిటీ ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ చైర్మన్ సిహెచ్ హనుమంతరావు, విజ్ఞాన్ కేంద్రం నిర్వహణ బాధ్యులు కొంగర వెంకటేశ్వర్లు ట్రస్ట్ కమిటీ మెంబర్ బి.రాము తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0