వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
హయత్‌నగర్, మార్చి 08, (వెలుగు నాడు ప్రతినిధి ) : వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ నందు హెచ్.పి.వి వ్యాక్సిన్( హ్యూమన్ పాఫీలోమా వైరస్ టీకా) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎల్.బి.నాగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్లు కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల దేశవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మరి విస్తరిస్తుందన్నారు.రాష్ట్రంలో ఏటా కొత్తగా 55 నుంచి 60 వేల వరకు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి అన్నారు.క్యాన్సర్ నివారణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు హెచ్.పీ.వీ వ్యాక్సిన్( హ్యూమన్ పాఫీలోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే క్యాన్సర్ ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు అని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి,డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు చింతల రవికుమార్,మహేశ్వరం,వనస్థలిపురం సూపరిడెంట్లునాగేందర్,కృష్ణ,వనస్థలిపురంఆర్.ఏం.ఓ.జయమాల,పలువురుడాక్టర్లుగఫర్,అనిత,కిరణ్,గీత,అర్చన,సుస్మిత,స్వర్ణలత,తిరుమల రెడ్డి,చంద్రశేఖర్,శ్రీనివాస్ రావు,అనురాధ,మాధవి,అరుణ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0