కుక్క కాటుకు గురైన వారిని పరామర్శించిన శాసనసభ్యులు
కుక్క కాటుకు గురైన వారిని పరామర్శించిన శాసనసభ్యులు
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వీధి కుక్కల నియంత్రణ దిశగా తగు చర్యలు తీసుకుంటాం
ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట జనవరి 17( వెలుగు నాడు ప్రతినిధి) : ధర్మవరప్పాడు (డీపీ) తండాకు చెందిన భూక్య శ్రీను, కొర్ర నందకిషోర్, గుగులోతు నలిని, గుగులోతు మంగమ్మ, భూక్య సైదమ్మ, ధీరావత్ రమాదేవి, భూక్య దేవి తదితరులు గ్రామంలోని వీధి కుక్కల దాడిలో గాయపడి జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని కుక్క కాటుకు గురైన బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా తెలుసుకున్నారు.అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే , బాధితులందరికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వీధి కుక్కల నియంత్రణ దిశగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.అదేవిధంగా వివిధ కారణాల చేత హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నటువంటి వారిని పరామర్శించారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
1
Funny
0
Angry
0
Sad
0
Wow
0