డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలిద్దాం ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలిద్దాం ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట, జనవరి24 ( వెలుగు నాడు ప్రతినిధి ) : సమాజాన్ని,ముఖ్యంగా యువతను నిర్వీర్యం చేసే డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలని స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోల్(తాతయ్య) పిలుపు నిచ్చారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈగల్,విజయవాడ వారి ఆధ్వర్యంలో శనివారం జగ్గయ్యపేటలో మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం జరిపి ప్రజలను చైతన్యపరిచారు.కళాశాల విద్యార్థులతో స్వామి వివేకానంద విగ్రహం వద్ద నుండి చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఈగల్ టీం, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర ,మున్సిపల్ కమిషనర్, వార్డుకౌన్సిలర్లు,మున్సిపల్ సిబ్బంది,మెప్మా సభ్యులు ఆరోగ్య వర్కర్లు,వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం శివాజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.అక్కడ జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యేమాట్లాడుతూ డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం అందించిన విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు బహుమతులు అందజేస్తామని అన్నారు.విద్యార్థులు డ్రగ్స్ వల్ల అనర్ధాలు తెలుసుకోవాలని వాటికి దూరంగా ఉండాలని,వాటిని సేవించుతున్న వారి సమాచారాన్ని గవర్నమెంట్ టోల్ ఫ్రీ నెంబర్ కి అందించాలని అన్నారు. పోలీసు వారు డ్రగ్స్ సంబంధించి చాలా అప్రమత్తంగా ఉండాలని ఎవరిని ఉపేక్షించవద్దని విజ్ఞప్తి చేశారు.డ్రగ్స్.ని పూర్తిగా నిర్మూలించాలని,అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0