సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ పత్రాలు అందచేత

Jan 22, 2026 - 23:23
 0  5
సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ పత్రాలు అందచేత

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ పత్రాలు అందచేత

విజయవాడ, జనవరి 22, వెలుగు నాడు ప్రతినిధి) :   విజయవాడ, పశ్చిమ నియోజకవర్గం 46 వ డివిజన్ లంబాడీ పేటకు చెందిన 54 ఏళ్ల జడ శ్రీను గుండె రక్త నాళాలు పూడుకు పోయాయి.. వైద్యులను సంప్రదించగా.గుండెకు బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు.ఆర్థికంగా సర్జరీ చేయించుకునే స్తోమత లేక కూటమి నాయకుల సాయంతో ఎమ్మేల్యే సుజనా చౌదరి నీ సంప్రదించారు.బైపాస్ సర్జరీ కు అవసరమైన 5,02,300/_ రూపాయల ఆర్థిక సాయం అందించాలి అంటూ ముఖ్య మంత్రి సహాయ నిధికి ఎమ్మెల్యే సుజనా లేఖ రాశారు.. దీనికి సంబంధించిన పత్రాలను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ బాధితునికి అంద చేశారు.. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్