ముస్లిం మైనార్టీ కమిటీ నియామకం చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
ముస్లిం మైనార్టీ కమిటీ నియామకం చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
జగ్గయ్యపేట,ఫిబ్రవరి 15, (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షులుగా షేక్ అక్బర్ ని నియమిస్తూ, నియామక పత్రాన్ని తమ నివాసంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అందజేశారు. ఈసందర్భంగా నూతనంగా నియమించిన కమిటీ సభ్యులను శ్రీరాం సాయి ప్రసాద్ ,శ్రీరాం చిన్నబాబు అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ,నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీ వర్గాల సమస్యలపై కమిటీ ప్రతిక్షణం స్పందిస్తూ, వారికి అవసరమైన సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందేలా కృషి చేయాలని సూచించారు. ముస్లింల సంక్షేమం కోసం కమిటీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న జగ్గయ్యపేట నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0