శ్రీని సత్కరించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య )
డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన నిఖిలశ్రీని సత్కరించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
జగ్గయ్యపేట, ఫిబ్రవరి 08 (వెలుగు నాడు ప్రతినిధి) : ఇటీవల, విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో విజయం సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన భాగం నిఖిలశ్రీని పశ్చిమ ఇబ్రహీంపట్నంలోని ఆమె నివాసంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) శనివారం ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.తన చిన్ననాటి స్నేహితుడైన వెంకట రవి శ్రీరామచంద్ర కూతురు డిప్యూటీ కలెక్టర్‌గా ఎన్నికవ్వటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తెలిపారు. నిఖిలశ్రీ సాధించిన ఈ విజయం మన జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆమెను ప్రోత్సహిస్తూ ఈ స్థాయికి ఎదిగేలా చేసిన ఆమె తల్లిదండ్రులు వెంకట రవి శ్రీరామచంద్ర , గీతల కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0