స్వచ్ఛ రధాలను ప్రారంభించిన ఎమ్మెల్యే తాతయ్య
స్వచ్ఛ రధాలను ప్రారంభించిన ఎమ్మెల్యే తాతయ్య
చెత్తకు 20 రకాల నిత్యవసర వస్తువుల పంపిణీ జగ్గయ్యపేట,ఫిబ్రవరి 24, (వెలుగు నాడు ప్రతినిధి ) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ రథం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జగ్గయ్యపేట పట్టణంలోని బంగారు కొట్ల సెంటర్ లో వినాయకుడి గుడి వద్ద అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య),స్వచ్ఛరథం (వాహనం) ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు వ్యర్ధాలకు విలువ కల్పించి ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ రథం కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే అన్నారు.ఇంటింటికి వచ్చే స్వచ్ఛ రథం వాహనానికి పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు, బాటిళ్లు,కవర్లు,ప్యాకెట్లు,గాజు సీసాలు, పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్టెలు, నూనె డబ్బాలు, ఇనుము, స్టీల్, అల్యూమినియం వ్యర్ధాలను ఇస్తే వాటిని తూకం వేస్తారని,ఆ వ్యర్ధాల విలువకు సమానమైన నగదును లెక్కించి దానికి బదులుగా సబ్బులు,టూత్ పేస్టులు,ఉల్లిపాయలు వంటి సుమారు 20 రకాల నిత్యావసర సరుకులు అక్కడికక్కడే అందజేస్తారని అన్నారు.గ్రామాలను చెత్తరహితంగా మార్చడం ప్రజలకు ఇంటి వద్ద సరుకులు అందించడం వాహనదారులకు ఉపాధి కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నితిన్ ,ఎల్ ఎస్ సీ ఎస్ సొసైటీ చైర్మన్ ధూళిపాళ్ల లక్ష్మణరావు, కౌన్సిలర్లు ఇర్రి నరసింహారావు, గొట్టే నాగరాజు ,ఈఓ షేక్ ఖాసిం,తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0