కాకరవాయిలో సిమెంట్ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

Apr 2, 2026 - 02:49
 0  22
కాకరవాయిలో సిమెంట్ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

కాకరవాయిలో సిమెంట్ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

జగ్గయ్యపేట ఏప్రిల్ 01 (వెలుగు నాడు ప్రతినిధి) : వత్సవాయి మండలం కాకరవాయి గ్రామంలో రూ 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) బుధవారం ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు.వత్సవాయి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు.కాకరవాయి గ్రామ సర్పంచి గుర్రం సత్యవతి రామారావు పదవీ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, గ్రామ సొసైటీ చైర్మన్ ఏపూరి నాగ శ్రీను, చిట్టూరి సుభాష్, బొల్లా వెంకటేశ్వరరావు, నంబూరి శ్రీనివాసరావు, చావా శాంతబాబు, ఉయ్యూరి అప్పారావు, చిట్టూరి రమేష్, కృష్ణవేణి,బొల్ల శంకరరావు, తేలపుట్ట వెంకటేశ్వర్లు వివిధ గ్రామాలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్