ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే ప్రయాణం
ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే ప్రయాణం
జగ్గయ్యపేట మే15 , (వెలుగు నాడు ప్రతినిధి) : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పొదుపు మంత్రాన్ని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అక్షరాల పాటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.కాన్వాయ్‌లు, ఆడంబరాలను పక్కన పెట్టి సామాన్యుడిలా జగ్గయ్యపేట నుంచి గౌరవరం వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.గౌరవరంలో శుక్రవారం జరిగిన ప్రజాదర్బారులో పాల్గొన్నారు.బస్సులో తోటి ప్రయాణికులతో ముచ్చటిస్తూ, ఆర్టీసీ సేవలపై అభిప్రాయాలను, వారి వ్యక్తిగత సాధకబాధకాలను అడిగి తెలుసుకుంటూ సాగిన ఈ ప్రయాణం ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0