మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఉక్కు కలవేదికలో రక్తదాన శిబిరం

Jan 24, 2026 - 00:13
 0  2
మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఉక్కు కలవేదికలో రక్తదాన శిబిరం

మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు

ఉక్కు కళావేదికలో రక్తదాన శిబిరం

జగ్గయ్యపేట,జనవరి23,(వెలుగు నాడు ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని ఉక్కు కళా వేదికలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ (రక్తదాన శిబిరం) విజయవంతంగా నిర్వహించారు.ఈ రక్తదాన శిబిరాన్ని కేడీసీసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సంయుక్తంగా ప్రారంభించి, స్వచ్ఛందంగా రక్తదానం చేసిన దాతలను అభినందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ కొండయ్య,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజా,పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేక వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్