ముక్త్యాల దేవస్థానం హుండీ లెక్కింపు

Jan 21, 2026 - 22:58
 0  14
ముక్త్యాల దేవస్థానం హుండీ లెక్కింపు

ముక్త్యాల దేవస్థానం హుండీ లెక్కింపు

జగ్గయ్యపేట, జనవరి21 (వెలుగు నాడు ప్రతినిధి): జగ్గయ్యపేట మండలం, ముక్త్యాల గ్రామములో పావన కృష్ణానది తీరమున వేంచేసియున్న శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానము మరియు శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానము లో బుధవారం హుండీలు లెక్కించారు.దేవదాయ శాఖ నందిగామ డివిజన్ తనిఖీదారు పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు, దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ వెలగపూడి లక్ష్మణఇందిరా దత్తు తరపున రామ్ ప్రసాద్ సమక్షములో హుండీలు తెరిచి లెక్కించగా 10 నెలల 10 రోజులకు గాను 2,38,881 రూపాయల ఆదాయము లభించింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్