మంథనిలో రసవత్తరంగా మారనున్న మునిసిపల్ పోరు

Jan 18, 2026 - 23:13
 0  5
మంథనిలో రసవత్తరంగా మారనున్న మునిసిపల్ పోరు

మంథనిలో రసవత్తరంగా మారనున్న మునిసిపల్ పోరు

చైర్మన్, వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్ ఖరారు 

పోటీకి సిద్ధమవుతున్న ఆశావాహులు 

అధికార పార్టీ టికెట్ల రేసులో నాయకులు

 తెలంగాణ జనవరి 18, ( వెలుగు నాడు ప్రతినిధి ) : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది.ఈసారి ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.మంథని మునిసిపాలిటీలో రిజర్వేషన్ల కేటాయింపు ఇలా.మంథని మునిసిపల్ చైర్మన్ పదవి బిసి జనరల్ కు కేటాయించారు.మునిసిపాలిటీలో మొత్తం 13 వార్డులు ఉండగా రిజర్వేషన్లు 2 ఎస్సీ, ఒకటి ఎస్టీ,3 బీసీలకు, ఏడు జనరల్ కేటాయించారు. 13 వార్డులలో మొత్తం 14,402 ఓటర్లు ఉన్నారు. 

వార్డుల వారిగా ఓటర్లు 

ఒకటవ వార్డు (ఎస్టి జనరల్) లో 673 పురుష ఓటర్లు 6503 మహిళా ఓటర్లు మొత్తం 1326, రెండవ వార్డ్ (ఎస్సీ జనరల్) లో 509 పురుష ఓటర్లు 545 మహిళా ఓటర్లు మొత్తం 1054, మూడవ వార్డు (జనరల్)లో పురుష ఓటర్లు 550, మహిళా ఓటర్లు 539, మొత్తం 1089, నాలుగవ వార్డు (ఎస్సీ మహిళ) పురుష ఓటర్లు 505 మహిళా ఓటర్లు 558 మొత్తం 1063, ఐదవ వార్డు (జనరల్) లో పురుష ఓటర్లు 476 మహిళా ఓటర్లు 539 మొత్తం 1015, ఆరవ వార్డు (జనరల్ మహిళ) లో పురుష ఓటర్లు 481 మహిళా హోటల్ 570 మొత్తం 1052, ఏడవ వార్డు (జనరల్ మహిళ)లో పురుష ఓటర్లు 496 మహిళా హోటల్ 598 మొత్తం 1094, ఎనిమిదవ వార్డు (జనరల్ మహిళ) లో పురుష ఓటర్లు 576, మహిళా ఓటర్లు 570 మొత్తం 1146, 9వ వార్డు (జనరల్ మహిళ) లో పురుష ఓటర్లు 518 మహిళా హోటల్ 571 మొత్తం 1089, పదవ వార్డు (బీసీ జనరల్) లో పురుష ఓటర్లు 545, మహిళ ఓటర్లు 568, మొత్తం 1113, 11వ వార్డు (బీసీ జనరల్)లో పురుష ఓటర్లు 580, మహిళా ఓటర్లు 624 మొత్తం 1204, 12వ వార్డు (బీసీ మహిళ) లో పురుష ఓటర్లు 535, మహిళా ఓటర్లు 553 మొత్తం 1088, 13వ వార్డు (జనరల్) పురుష ఓటర్లు 505 మహిళా ఓటర్లు 564 మొత్తం 1069 మంది ఓటర్లు ఉన్నారు.

పోటీకి సిద్ధమవుతున్న ఆశావాహులు

మున్సిపాలిటీలో రిజర్వేషన్ కలిసి వచ్చిన ఆశావాహులు పోటీలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇదే సరైన అవకాశం అని భావిస్తున్నారు. రాజకీయాల్లో నాయకులుగా చలామణి అవుతున్న వారు కొన్ని వార్డుల్లో మహిళ లకు రిజర్వేషన్ కావడంతో పోటీలో తమ భార్యలను, తల్లులను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నారు. ప్రధానంగా పార్టీ టికెట్ దక్కించుకునేందుకు తమకు సన్నితంగా ఉండే బడా నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. 

టికెట్ దక్కుతుందా? లేదా? 

అధికార పార్టీ కాంగ్రెస్ లో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులకు టికెట్ దక్కుతుందా లేదా అనే సంశయం తొలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో జనరల్ వార్డుల్లో సుమారు 10 మంది వరకు ఆశావాహులు పోటీలో నిలబడేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తుందో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. 

క్యాండిడేట్, క్యారెక్టర్, క్యాష్ ప్రధానం (సి సి సి)

మంథని మేజర్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీ గా రూపాంతరం చెందిన తర్వాత 2020లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా, మంథని నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పెద్దపల్లి జెడ్పి చైర్మన్ గా కొనసాగుతూ చక్రం తిప్పారు. 13 వార్డ్ కౌన్సిలర్లకు 10 కౌన్సిలర్లను బిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. దీంతో చైర్మన్ పదవి కూడా బిఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. 2023లో మునిసిపాలిటీలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుని 16 ఫిబ్రవరి 2024 న జరిగిన అవిశ్వాసంలో బి ఆర్ ఎస్ పార్టీ చైర్మన్ పదవిని కోల్పోయింది. 18 మార్చి 2024 న చైర్మన్ గా పెండ్రు రమాదేవి వైస్ చైర్మన్ గా శ్రీపతి బానయ్య పదవి బాధ్యతలు స్వీకరించారు. 2014 నుంచి 2023 వరకు కొనసాగిన టిఆర్ఎస్ పార్టీ హవాకు మంథనిలో చెక్ పడింది. మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో 2025 డిసెంబర్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను దక్కించుకుంది. ఈ దశలో నియోజకవర్గ కేంద్రమైన మంథని మునిసిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగిరేయాలనే ధృడ నిశ్చయంతో మంత్రి శ్రీధర్ బాబు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ లో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 13 వార్డులను గెలిచి బిఆర్ఎస్ పార్టీని క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. దీనికి అభ్యర్థి గుణగణాలు, అభ్యర్థికి వార్డులో ఉన్న పలుకుబడి, పోటీలో ప్రత్యర్థిని తట్టుకునేందుకు గల ఆర్థిక స్తోమత ప్రధానంగా చూస్తున్నారు. ఒక్కో వార్డులో 1000కి పైబడి ఓటర్లు ఉన్నారు. ఎన్నికలు ఖరీదైనవిగా మారడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుని ఓటుగా మలుచుకునేందుకు డబ్బు పంపిణీ ప్రధాన పాత్ర పోషించనున్నది. అలాగే మద్యం పంపిణీ ప్రధానంగా ఉండనున్నది అన్నా! మీ సపోర్ట్ మాకే ఉండాలే 

మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహుల్లో ఆశలు మొదలయ్యాయి. తమ వార్డులోని చిన్న పెద్ద నాయకులను ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈనెల 17న రిజర్వేషన్లు జాబితా వెలువడడంతో ఆశావాహులు తమ సన్నిహితులకు, కుల సంఘాల పెద్దలకు, మహిళా సంఘాల లీడర్లకు ఫోన్లు చేయడంలో తన మునకలై ఉన్నారు. అన్నా, తమ్మి, మామ, బాబాయ్ మీ మద్దతు నాకే ఉండాలని ప్రాధేయ పడుతున్నారు. షెడ్యూల్ విడుదలై తమ తమ పార్టీల బీఫారాలు దక్కించుకొని, నామినేషన్లు వేసి, నామినేషన్లు విత్ డ్రాలు జరిగి ఎన్నికల బరిలో దిగితే గాని ఆశావాహ అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. అప్పటికి ఓటరు దేవుళ్ళు ఎవరిని ఆశీర్వదిస్తారో వేచి చూడాలి.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 1
admin వెలుగునాడు తెలుగు న్యూస్