టోల్ ప్లాజా వద్ద హెల్మెట్ ట్రాఫిక్ నిబంధనల అవగాహన
జగ్గయ్యపేట జనవరి 13 (వెలుగు నాడు న్యూస్) : మండలంలోని,చిలకల్లు టోల్ ప్లాజా పరిసర ప్రాంతంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా, స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం, హెల్మెట్ వల్ల ప్రాణరక్షణ ఎలా జరుగుతుందో వివరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ. శ్రీనివాసరావు మాట్లాడుతూ అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్ల వల్ల కలిగే నష్టాలను వాహనదారులకు తెలియజేశారు.
పోలీసు అధికారులు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సిగ్నల్స్‌ను గౌరవించాలని, లేన్ డిసిప్లిన్ పాటించాలని సూచించారు. కుటుంబ సభ్యుల భద్రత కోసం, తమ స్వంత ప్రాణాల రక్షణ కోసం ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0