కోడి పందాలు, జూద క్రీడలు నిషేదం.కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవుఎస్ ఐ అర్జున్
హైకోర్టు ఉత్తర్వులు కచ్ఛితంగా అందరూ పాటించాలి
పెనుగంచిప్రోలు జనవరి 13 (వెలుగు నాడు న్యూస్)
పెనుగంచిప్రోలు, మండలం,నవబు పేటలో ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేసిన సీఐవెంకటేశ్వర్లు,ఎస్ఐ అర్జున్, ఎమ్మార్వో శాంతిలక్ష్మి
కోడి పందాలు, బెట్టింగులు నిర్వహించుట, ప్రోత్సహించుట, పాల్గొనుట చట్టవిరుద్ధమని, పెనుగంచిప్రోలు మండలం లో ఎవరైనా కోడి పందాలు, గుండాట, బెట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పెనుగంచిప్రోలు ఎస్సై అర్జున్ హెచ్చరించారు.మండలం లో ఎక్కడా కోడి పందాలు, గుండాట, బెట్టింగులు జరగకుండా పోలీసు, రెవిన్యూ అధికారులు గట్టి నిఘా పెట్టామన్నారు. ఉత్తర్వులను అతిక్రమించినచో సంబంధిత చట్టముల ప్రకారం కేసులు నమోదు చేసి శిక్షించడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా కోడి పందాలు, గుండాట, బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు ఎవరైనా గుర్తిస్తే, వారిపై చట్టరీ చర్యలు తీసుకోవడం జరిగిందని పెనుగంచిప్రోలు ఎస్సై అర్జున్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, పరవేశ్వరులు మండల రెవెన్యూ అధికారి శాంతి కుమారి. పాల్గొన్నారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0