తెలుగువారి గుండెలపై చెరగని సువర్ణక్షరాలు ఎన్టీఆర్
తెలుగువారి గుండెలపై చెరగని సువర్ణాక్షరాలు ఎన్టీఆర్
జగ్గయ్యపేట, జనవరి18, (వెలుగు నాడు ప్రతినిధి) : ఎన్టీఆర్ 30వ వర్ధంతిని జగ్గయ్యపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం,మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు,నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరాం చిన్నబాబు పాల్గొన్నారు.ముందుగా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నివాసం వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ ఎన్టీఆర్ పరిపాలన కాలంలో అమలు చేసిన అనేక చారిత్రాత్మక సంస్కరణల ఫలితాలను నేటికీ ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు.ఎన్టీఆర్ తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి సరికొత్త దిశను చూపించారని అన్నారు.అనంతరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద శ్రీరాం సుబ్బారావు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజా, పట్టణ పార్టీ అధ్యక్షుడు మేక వెంకటేశ్వర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు,తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
1