సమాజ సేవలో నడిమి తిరువూరు సహకార సంఘం ముందంజ

Feb 5, 2026 - 02:33
 0  3
సమాజ సేవలో నడిమి తిరువూరు సహకార సంఘం ముందంజ

సమాజ సేవలో నడిమి తిరువూరు సహకార సంఘం ముందంజ

తిరువూరు ఫిబ్రవరి 04 ( వెలుగు నాడు ప్రతినిధి) : తిరువూరు నియోజకవర్గంలో రైతు సంక్షేమం, సామాజిక సేవ లక్ష్యంగా ది నడిం తిరువూరు సహకార సంఘం ఆదర్శంగా నిలుస్తోందని సొసైటీ చైర్మన్ కంచి రఘు ప్రవీణ్ (బాబీ) పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సొసైటీ కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.తమ పదవి కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించిన కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సహకారం, పాలకవర్గం ఐక్యత, సిబ్బంది కృషితోనే సొసైటీని మరింత బలోపేతం చేయగలుగుతున్నామని అన్నారు.ప్రస్తుతం ది నడిం తిరువూరు సహకార సంఘం రూ.27 కోట్ల 54 లక్షల టర్నోవర్ సాధించడం గర్వకారణమని తెలిపారు. ఇది రైతుల విశ్వాసానికి, సొసైటీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు.సొసైటీ పరిధిలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని.6405 యూరియా బస్తాలు,1304 కాంప్లెక్స్ బస్తాలు సరఫరా చేసినట్లు చెప్పారు.అలాగే 312 మంది రైతులకు రూ.5 కోట్ల 70 లక్షల 82 వేల విలువైన రుణాలు అందజేయడం జరిగిందని వివరించారు. దీని ద్వారా రైతులు సాగు పనులు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం లభించిందన్నారు.సామాజిక బాధ్యతలో భాగంగా ఈ నెల 8వ తేదీ ఆదివారం నాడు స్థానిక జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో సెంటీని సిటీ, మాన్వీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ వైద్య శిబిరంలో సాధారణ వైద్యం, స్పెషలిస్ట్ పరీక్షలు, అవసరమైన మందులు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరా, తాగునీటి సమస్యకు పరిష్కారంగా ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కంచి బాబీ వెల్లడించారు. రైతుల ఆర్థిక అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్