రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
జగ్గయ్యపేట,ఫిబ్రవరి 08 ,( వెలుగు నాడు ప్రతినిధి) : రౌడీ,సస్పెక్ట్ షీటర్లకు సీఐ పి వెంకటేశ్వర్లు జగ్గయ్యపేట పోలీసు స్టేషన్ లో ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు.పద్ధతి మార్చుకుని సన్మార్గంలో నడవాలని, ఇతరులను వేధిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవనిహెచ్చరించారు.సత్ప్రవర్తనతో మెలిగే వారిపై షీట్లను ఎత్తివేసేందుకు సిఫార్సు చేస్తామని, ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా జీవించాలని సూచించారు. సత్ప్రవర్తనతోనే ప్రశాంత జీవనం సాధ్యమని హితవు చెప్పారు.సీఐ తోపాటుగా ఎస్సై రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0