పొట్టి శ్రీరాములుకు పోలీసు సిబ్బంది నివాళులు
పొట్టి శ్రీరాములుకు పోలీసు సిబ్బంది నివాళులు
జగ్గయ్యపేట మార్చి16 (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బందితో కలిసి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర స్థాపన కోసం చేసిన త్యాగం భారత చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు.భాషా ఆధారిత రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన చేసిన నిరాహార దీక్ష,త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని అంటూ ప్రజల హక్కుల కోసం ఆయన చూపిన త్యాగస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0