పట్టాదార్ పాస్‌బుక్స్ పంపిణీ రేషన్ షాప్, రైస్ మిల్లులపై ఆర్డీవో మాధురి ఆకస్మిక తనిఖీలు
పట్టాదార్ పాస్‌బుక్స్ పంపిణీ రేషన్ షాప్, రైస్ మిల్లులపై ఆర్డీవో మాధురి ఆకస్మిక తనిఖీలు
తిరువూరు, ఫిబ్రవరి 03 (వెలుగు నాడు ప్రతినిధి) : ఎన్‌టీఆర్, జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) మాధురి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పట్టాదార్ పాస్‌బుక్స్‌ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ వై. నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాధురి రైతులతో మాట్లాడుతూ, తమ భూముల వివరాలు పట్టాదార్ పాస్‌బుక్స్‌లో సక్రమంగా నమోదు అయ్యాయా లేదా మరోసారి పరిశీలించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పట్టాదార్ పాస్‌బుక్స్ రైతులకు భూ హక్కుల భద్రత కల్పించడంలో కీలకమని, వాటి ప్రాముఖ్యతను వివరించారు.అనంతరం లక్ష్మీపురం గ్రామంలో ఉన్న మామిడి రోశయ్య చౌక ధరల దుకాణం నెం. 0613031ను ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ సరుకుల నిల్వలు, పంపిణీ విధానం, రికార్డులను పరిశీలించి నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాలంటూ సూచనలు ఇచ్చారు.తదుపరి గ్రామంలో ఉన్న విజయ వెంకటేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ (రైస్ మిల్)ను కూడా ఆర్డీవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వలు,మిల్లింగ్ ప్రక్రియ, రికార్డుల నిర్వహణను పరిశీలించి ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే తగిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఈ తనిఖీలలో తహసీల్దార్ తిరువూరు వై. నాగమణి, పీడీఎస్ డీటీ శ్వేత పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0