ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి పోలంపల్లి డ్యామ్ మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయాలని కోరిన రాజగోపాల్ (తాతయ్య)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి పోలంపల్లి డ్యామ్ మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయాలని కోరిన రాజగోపాల్ (తాతయ్య)
జగ్గయ్యపేట ఫిబ్రవరి 13, (వెలుగు నాడు ప్రతినిధి) వత్సవాయి మండలం, పొల్లంపల్లి గ్రామ పరిధిలో ఉన్న మునియేరు పాత ఆనకట్ట పునరుద్ధరణ మరియు మరమ్మత్తు పనులకు సంబంధించి అంచనా వ్యయం రూ.21.50 కోట్లుగా ఉండగా,ఈ ఆనకట్ట ద్వారా సుమారు 25 గ్రామాలకు చెందిన దాదాపు 36,000 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందుతోంది.ఇటీవల వరుస వరదల కారణంగా ఆనకట్ట దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ప్రయోజనార్థం ఆనకట్ట పునరుద్ధరణ పనులను అత్యవసర ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి ని కలిసి వినతిపత్రం సమర్పించగా, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా అవసరమైన నిధులు మంజూరు చేయిస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది.అందువల్ల, మునియేరు పాత ఆనకట్ట పునరుద్ధరణ పనులకు త్వరితగతిన నిధులు విడుదల చేసి, పనులు ప్రారంభించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.అదేవిధంగా రాజమండ్రి శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో ఈనాం భూముల సమస్యను కూడా ప్రస్తావించడం జరిగింది దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0