యోగి వేమన జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాజశేఖర్ బాబు
యోగి వేమన జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాజశేఖర్ బాబు
విజయవాడ, జనవరి 19, ( వెలుగు నాడు ప్రతినిధి) : యోగివేమన జయంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్న నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి.ఎస్.సోమవారం నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వారి కార్యాలయంలో యోగివేమన చిత్రపటానికి పూలమాలవేసి వారు చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్, కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్, సి. పి. ఓ అధికారులు, పోలీస్ అధికారులు, సి.పి.ఓ. సిబ్బంది తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.యోగివేమన తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో పద్యాలు రాసి ప్రజలను మెప్పించిన మహాకవి అని తెలిపారు. వేమన పద్యాలు వినని, తెలియని వారు లేరనడంలో అతిశయోక్తి లేదన్నారు.యోగివేమన జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0