భూగర్భ జలాల సంరక్షణకు ఇంకుడు గుంతలు సమర్థవంతమైన మార్గం

Jun 15, 2026 - 00:22
 0  8
భూగర్భ జలాల సంరక్షణకు ఇంకుడు గుంతలు సమర్థవంతమైన మార్గం

భూగర్భ జలాల సంరక్షణకు ఇంకుడు గుంతలు సమర్థవంతమైన మార్గం

గీతా మందిర్ సెంటర్ నూతన ఇంకుడు గుంతల ప్రారంభోత్సవం అవగాహన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య 

నందిగామ జూన్ 14,(వెలుగు నాడు ప్రతినిధి) : నందిగామ పట్టణంలోని గీతా మందిర్ సెంటర్ వద్ద నూతన అపార్ట్మెంట్‌లో శనివారం నిర్వహించిన ఇంకుడు గుంతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు, కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా అపార్ట్మెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను ప్రారంభించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం ద్వారా భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించవచ్చని తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న నీటి సమస్యలను అధిగమించేందుకు ప్రతి నివాస సముదాయం, అపార్ట్మెంట్, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో ఇంకుడు గుంతల నిర్మాణం అవసరమని ఆమె పేర్కొన్నారు. అనంతరం అపార్ట్మెంట్‌లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల అవగాహన వాల్ పోస్టర్‌ను ఎమ్మెల్యే సౌమ్య ఆవిష్కరించారు. జల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, భవిష్యత్ తరాలకు నీటి వనరులను అందించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, కూటమి నాయకులు, అపార్ట్మెంట్ నివాసితులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్