తిరువూరు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకులు పోస్టులు భర్తీ.
తిరువూరు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకులు పోస్టులు భర్తీ.
తిరువూరు, జనవరి 26,( వెలుగునాడు ప్రతినిధి) : తిరువూరు మండలం, పరిధిలోని తిరువూరు గంపలగూడెం ఏ కొండూరు మరియు. విస్సన్నపేట మండలాల్లో అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడి ఆయా పోస్టులు, ఖాళీగా ఉన్నవి వాటి భర్తీ నిమిత్తం పథక సంచాలకులు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారత అధికారి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వారి ప్రణాళిక ప్రకారం ఖాళీ పోస్టులు భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేయట మరియు అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుట జరిగింది . కావున అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు27-01-2026 నుండి 05-2-2026 సాయంత్రం 5 గంటల లోపల తిరువూరు ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి అభ్యర్థి స్వయంగా వచ్చి అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు. దీనికి అర్హతలు1.అంగన్వాడి ఆయా పోస్ట్ కు 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి
2: ది.01.07.2025 నాటికి 21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలు వరకు
3: ఎస్టి ఎస్సి బీసీ అభ్యర్థులు లేటెస్ట్ కుల ధ్రువీకరణ పత్రము జారీ చేయాలి
4: అదే గ్రామంనకు సంబంధించి లేటెస్ట్ నివాస ధ్రువీకరణ పత్రము ఉండాలి
5: ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు జత పరచవలెను.
6: విధవరాలు అయినచో భర్త మరణం ధ్రువీకరణ పత్రము జతపరచాలి
7: విధవరాలు అయ్యుండి మైనర్ పిల్లలు ఉన్నచో పిల్లల జననాలు ద్రవీకరణ పత్రము జతపరచాలి
8: అంగవైకల్యం కలిగి ఉన్నచో వైకల్య దృవీకరణ పత్రము జతపరచాలి
9: అనాధలు అయినచో ధ్రువీకరణ పత్రం10: లేటెస్ట్ పాస్పోర్ట్ ఫొటోలు 2:పైన తెలిపిన విధంగా సర్టిఫికెట్లు జతపరచాలని చెప్పారు. కావున ఇలాంటి అవకాశాన్ని తిరువూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కొరారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0