రక్తదాతల ఇళ్లకు వెళ్లి సత్కరించిన రెడ్ క్రాస్ సొసైటీ

Jun 15, 2026 - 00:44
 0  13
రక్తదాతల ఇళ్లకు వెళ్లి సత్కరించిన రెడ్ క్రాస్ సొసైటీ

రక్తదాతల ఇళ్లకు వెళ్లి సత్కరించిన రెడ్ క్రాస్ సొసైటీ

యువత మరింతగా రక్తదానానికి ముందుకు రావాలి కర్లపాటి

జగ్గయ్యపేట జూన్14, (వెలుగునాడు ప్రతినిధి) :  ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గయ్యపేట ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో పట్టణంలో పలువురు రక్తదాతలను ఘనంగా సత్కరించారు. నిస్వార్థంగా రక్తాన్ని అందిస్తూ ఎందరో ప్రాణాలను కాపాడుతున్న రక్తదాతల సేవలను గుర్తిస్తూ, రెడ్ క్రాస్ ప్రతినిధులు నేరుగా పట్టణానికి చెందిన ప్రముఖ రక్తదాతలు కళ్యాణం కృష్ణారావు దంపతులను (21 సార్లు) అలాగే నన్నెబోయెన వీర శంకర్ దంపతులను (7 సార్లు) వారి నివాసాల వద్దే శాలువాలు కప్పి, ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా నిర్వహణ కమిటీ సభ్యులు కర్లపాటి వెంకట శ్రీనివాసరావు మాట్లాడుతూ దాతలు చేసే రక్తదానం మరొకరికి పునర్జన్మను ఇస్తుందన్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణాపాయంలో ఉన్న రోగులకు, గర్భిణీలకు మరియు బాధితులకు సమయానికి రక్తం అందడం ఎంతో కీలకమన్నారు . రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, కేవలం మానవత్వంతో చేసే రక్తదానం ద్వారానే ప్రాణాలు కాపాడగలమని ఆయన పేర్కొన్నారు. నిస్వార్థంగా రక్తాన్ని అందిస్తున్న రక్తదాతలను గౌరవించుకోవడం సమాజ బాధ్యతని, భవిష్యత్తులో యువత మరింతగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ సన్మాన కార్యక్రమంలో జగ్గయ్యపేట రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ ట్రెజరర్ మానేపల్లి నాగబ్రహ్మం, జగ్గయ్యపేట ఒకటో వార్డు కౌన్సిలర్ కొలగాని రాము, కర్లపాటి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి రాయపుడి వెంకటేశ్వరరావు, మల్లికార్జున్, గుప్తా, టాండన్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్