అంగన్వాడీ మహిళల రిలే నిరాహార దీక్షలు

Feb 24, 2026 - 23:13
 0  10
అంగన్వాడీ మహిళల రిలే నిరాహార దీక్షలు

అంగన్వాడీ మహిళల రిలే నిరాహార దీక్షలు

జగ్గయ్యపేట,ఫిబ్రవరి 24, (వెలుగు నాడు ప్రతినిధి ) : ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ ( సిఐటియు) ఆధ్వర్యంలో చిల్లకల్లు ఐసిడిఎస్ ఆఫీస్ ఎదురుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు మంగళవారం కూడా కొనసాగాయి.ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కమిటీ సభ్యులు బి రాము, సిఐటియు జగ్గయ్యపేట మండల కార్యదర్శి షేక్ గౌస్ మియా మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ 26000 ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 1810 మినీవర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు.అలాగే అంగన్వాడీలకు సంబంధించిన పలు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాంప్రసాద్,చిల్లకల్లు ప్రాజెక్ట్ యూనియన్ కార్యదర్శి టి మధుకుమారి, అధ్యక్షురాలు షేక్ అల్లాబీ, సువర్చల, రత్న కుమారి, లక్ష్మి, విశాలాక్షి, ఉమారాణి, మేరీ, జానమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్