PACS చైర్మన్లు మరియూ సెక్రటరీ లతో సమీక్ష సమావేశం

Jan 29, 2026 - 00:18
 0  21
PACS చైర్మన్లు మరియూ సెక్రటరీ లతో సమీక్ష సమావేశం

PACS చైర్మన్లు మరియూ సెక్రటరీ లతో సమీక్ష సమావేశం

తిరువూరు జనవరి 28 (వెలుగు నాడు ప్రతినిధి ) : తిరువూరు, గంపలగూడెం, మండలంలోని అన్ని PACS చైర్మన్లు, సెక్రటరీలతో జిల్లా తెలుగు విభాగ రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఖరీఫ్ సాగు పరిస్థితులు, ఎరువుల సరఫరా, రైతుల సమస్యలపై చర్చించారు. మండలంలో యూరియా కొరత లేదని, రైతుల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెరుకూరి రాజేశ్వరరావు స్పష్టం చేశారు. వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తూ PACSల ద్వారా నిరంతర సరఫరా జరుగుతోందన్నారు.రేగళ్ల వీరారెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది మొక్కజొన్న సాగు సుమారు 80 శాతం పెరిగిందని, దానికి అనుగుణంగా ప్రభుత్వం అధికంగా యూరియా సరఫరా చేస్తోందన్నారు.మండల టీడీపీ అధ్యక్షులు మానుకొండ రామకృష్ణ రైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా PACSలను సంప్రదించాలని సూచించారు.ఈ సమావేశంలో పలువురు PACS చైర్మన్లు, సెక్రటరీలు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్