ఎరుకోపాడు పాఠశాలకు ఎస్బీఐ కంప్యూటర్ బహుకరణ

Feb 4, 2026 - 02:12
 0  12
ఎరుకోపాడు పాఠశాలకు ఎస్బీఐ కంప్యూటర్ బహుకరణ

ఎరుకోపాడు పాఠశాలకు ఎస్బీఐ కంప్యూటర్ బహుకరణ

తిరువూరు ఫిబ్రవరి 03( వెలుగు నాడు ప్రతినిధి) : తిరువూరు మండల పరిధిలోని ఎరుకోపాడు గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (పీఎం శ్రీ స్కూల్) విద్యార్థుల విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకొని సామాజిక సేవా దృక్పథంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరువూరు శాఖ వారు మంగళవారం పాఠశాలకు కంప్యూటర్‌ను బహుకరించారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భారతీయ స్టేట్ బ్యాంక్ తిరువూరు శాఖ చీఫ్ మేనేజర్ దాసరి నాగన్న క్యాష్ ఆఫీసర్ బి.ఎల్.హెచ్. ప్రసాద్ పాల్గొని పాఠశాలకు కంప్యూటర్‌ను అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. సాంబశివరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడే విధంగా సహకారం అందించిన ఎస్బీఐ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్