సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు
సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు
జగ్గయ్యపేట,ఫిబ్రవరి 15, ( వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఘోర భాయ్ సేవా సంఘం అధ్యక్షతన ఆదివారం సంత్ సేవాలాల్ 287వ జయంతి ఉత్సవములు కోదాడ రోడ్డు లోని టీవీఎస్ షో రూమ్ ప్రక్కన లాహోరీ తొలిచా నాయక్ ఇంటి ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన లంబాడి సంఘం సభ్యులందరూ పూజా కార్యక్రమంలో పాల్గొని సేవాలాల్ కు నివాళులర్పించారు.ఆ దేవ దేవుని ఆశీస్సులు లంబాడి కుటుంబాల అందరికీ కూడా ఉండాలని కోరుకున్నారు.లాహోరీ బద్దు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి భూక్య బధ్యానాయక్,ఉపాధ్యక్షులు భూక్య కృష్ణ నాయక్, కోశాధికారి లాహోరీ మోహన్ దర్య,ఎంఈఓ ధరావత రవీందర్ నాయక్,ఎంఈఓ లావుడియా చిట్టిబాబు,సంఘం సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0