సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

Feb 22, 2026 - 23:46
 0  10
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

జగ్గయ్యపేట, ఫిబ్రవరి 22,(వెలుగు నాడు ప్రతినిధి) : సంత్ శ్రీసేవాలాల్ మహరాజ్ గిరిజన సమాజానికి మార్గదర్శకులు, ఆయన చూపిన సేవా మార్గాన్ని అందరూ అనుసరించాలని స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్( తాతయ్య)అన్నారు.జగ్గయ్యపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఆదివారం జరిగిన సంత్ సేవాలాల్ మహరాజ్ 287 వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే తాతయ్య,కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ పాల్గొన్నారు.జగ్గయ్యపేట నియోజకవర్గ ఎస్టీ సోదరులు మరియు గుగులోతు హుస్సేన్ నాయక్, లాహోరి కుసుమలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, విద్య, వైద్య సదుపాయాలు, గిరిజన గురుకుల పాఠశాలల బలోపేతం, ఉపాధి అవకాశాల కల్పన, భూస్వామ్య హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.ఇదే కార్యక్రమంలో రఘురామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, డిజిటల్ విద్య అవకాశాలను విస్తరిస్తున్నారని అన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.గిరిజనులకు ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో చేరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు గిరిజన సమాజానికి మార్గదర్శకమని, ఆయన చూపిన సేవా మార్గాన్ని అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మూడవతు దారానాయక్,మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ, జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇస్లావతు శ్రీను నాయక్, గూగులోతు సేవ్యా నాయక్, భాణవతు కాంతారావు, భూక్యా భధ్రు,వెంకటేశ్వర్లు,లక్ష్మణ్ నాయక్, శివ కుమార్ నాయక్ ,ఎస్టీ సంఘాల నాయకులు,గిరిజన సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్