శ్రీతిరుపతమ్మ ఆలయం డోలు వాయిద్యం ఉద్యోగి సస్పెండ్
శ్రీతిరుపతమ్మ ఆలయం డోలు వాయిద్యం ఉద్యోగి సస్పెండ్
భక్తుని మోసం చేసినట్లుగా అభియోగంomo
జగ్గయ్యపేట, మార్చి11,( వెలుగు నాడు ప్రతినిధి) : పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి ఆభరణాలు చేయించే విషయంలో కమిషన్ కోసం కక్కుర్తి పడిన గుంటుపల్లి హరి సత్యనారాయణ అనే ఆలయ ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లుగా ఆలయ కార్యనిర్వాహణాధికారి మహేశ్వరరెడ్డితెలియజేసారు.సత్యనారాయణ శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలోడోలువాయిద్యకారుడు.తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన ఒక భక్తుడిని అమ్మవారికి ఆభరణాలు చేయించేవిషయంలోమాయమాటలతో మోసగించాడని ఇతనిపై ఆరోపణ.ఈ విషయంలో మీడియాలో వచ్చిన సమాచారాన్ననుసరించి ప్రాధమిక విచారణ అనంతరం ఆ ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లుగా ఈఓ తెలిపారు.వినుకొండకు చెందిన భక్తులు మన్నే వెంకటేశ్వరరావు దంపతుల ఫిర్యాదు మేరకు విచారణ చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఈఓ తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0