ప్రైవేట్ బస్సుల అగ్ని ప్రమాదాల నేపథ్యంలో కట్టుదిట్టమైన తనిఖీలు
ప్రైవేట్ బస్సుల అగ్ని ప్రమాదాల నేపథ్యంలో కట్టుదిట్టమైన తనిఖీలు
తిరువూరు చెక్‌పోస్ట్ వద్ద ఫైర్ సిబ్బంది అలెర్ట్రు తిరువూరు, మార్చి 29 ( వెలుగు నాడు ప్రతినిధి) : తిరువూరు, ఇటీవల వరుసగా చోటుచేసుకున్న ప్రైవేట్ బస్సుల అగ్ని ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కఠిన ఆదేశాలు జారీ చేయడంతో ఫైర్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదాలను ముందుగానే నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టుల వద్ద విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దులోని తిరువూరు చెక్‌పోస్ట్ వద్ద ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఆదివారం తెల్లవారుజామున 6 గంటల నుంచే తనిఖీలు ప్రారంభించారు. రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరం వాహనాల పరిశీలన కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.ప్రత్యేకంగా ప్రైవేట్ బస్సులపై దృష్టి సారించిన ఫైర్ సిబ్బంది, ప్రతి బస్సును ఆపి సమగ్రంగా తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా బస్సులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు, డ్రైవర్‌ల లైసెన్సులు పరిశీలిస్తూ, వాహనంలో ఎలాంటి సాంకేతిక లోపాలు ఉన్నాయా అనే దానిపై సవివరంగా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా బస్సుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నాయా, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంధన లీకేజీలు, ఎలక్ట్రికల్ లోపాలు, అగ్ని ప్రమాదాలకు దారితీసే ఇతర ప్రమాదకర అంశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ తనిఖీల్లో ఆర్. బుచ్చిబాబు (లీడింగ్ ఫైర్‌మ్యాన్), ఎస్. తిరుపతి వెంకయ్య (ఫైర్‌మ్యాన్), వై. సత్యనారాయణ (హోమ్ గార్డ్), డి. రాంబాబు (ఫైర్ ఆఫీసర్) పాల్గొని విధులు నిర్వర్తించారు.ప్రజల ప్రాణ భద్రతే తమకు ముఖ్యమని, ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండి భద్రతా నిబంధనలు పాటించేలా సహకరించాలని ఫైర్ శాఖ అధికారులు సూచించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0