ధార్మికతపై దాడి చేసిన వైసీపీ ప్రభుత్వానికి సుప్రీం తీర్పు చెంపదెబ్బ
ధార్మికతపై దాడి చేసిన వైసీపీ ప్రభుత్వానికి సుప్రీం తీర్పు చెంపదెబ్బ
జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ
విజయవాడ,జనవరి 29, (వెలుగు నాడు ప్రతినిధి) : శ్రీవారి తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న విషయం సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ దర్యాప్తు సంస్థ స్పష్టంగా తేల్చి చెప్పిందని ఇది జగన్ ప్రభుత్వానికి చెప్ప పెట్టులాంటిదని, ధార్మికతపై దాడి చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు కూడా బుద్ది చెప్పారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు.గురువారం ఉదయం గురునానక్ నగర్ లోని ఎం.పి కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గద్దె అనురాధ మీడియా వారితో మాట్లాడుతూ ఇది కేవలం ఒక నాణ్యత లోపం కాదని, ఇది హిందూ మతంపై జరిగిన నీచమైన దాడి అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు జగన్ మోహన్ రెడ్డి పాలనలో తిరుమల లడ్డూ ప్రసాదంలో సరైన నెయ్యి వాసన కూడా రావడం లేదని భక్తులు అప్పుడే ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఆ రోజునే టీడీపీ ఈ అంశంపై అనుమానాలు వ్యక్తం చేసినా, వైసీపీ నాయకులు బుకాయించారని విమర్శించారు.ఈ రోజు సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని సిట్ దర్యాప్తులో లడ్డూ తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని తేల్చి చెప్పిందన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఇంత ఘోరమైన పాపం చేసిన జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. వైకాపా వారికి ధార్మికతన్నా, భక్తుల మనోభావాలన్నా లెక్క లేదని.దేవుడి ప్రసాదంలో కూడా అవినీతి చేయగలిగే స్థాయికి దిగజారారని ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి పాలన మొత్తం అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలతో నిండిపోయిందన్నారు. హిందువులు దేవదేవుడిగా భావించే వెంకటేశ్వర స్వామి లడ్డూలో జంతు నూనెలు కలపడం కంటే నీచమైన చర్య ఇంకేదీ లేదన్నారు.1857లో బ్రిటిష్ పాలనలో సిపాయిలకు ఇచ్చిన తూటాలపై ఆవు కొవ్వులు రాయడం దేశాన్ని కుదిపేసిందని గుర్తు చేస్తూ,స్వాతంత్రం లేకపోయినా మన పూర్వీకులు ధార్మికత కోసం పోరాడారని చెప్పారు. ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో, రాజ్యాంగ హక్కులు ఉన్నప్పటికీ, జగన్ లాంటి పాలకుల వల్ల దేవుడి ప్రసాదమే అపవిత్రం కావాల్సి వచ్చిందన్నారు. రామతీర్థంలో రాముడి విగ్రహం కూల్చివేత,అంతర్వేదిలో రథం దహనం, ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదంలో కెమికల్ కల్తీ,ఇవన్నీ వైసీపీ పాలనలో హిందూ మతంపై జరిగిన వరుస దాడులేనని అన్నారు.ప్రజలందరూ ఈవాస్తవాలను గమనించాలని,జగన్ మోహన్ రెడ్డి మతాలకు, కులాలకు గౌరవం లేకుండా అవినీతి సొమ్ము కోసం అనేక అరాచకాలకు పాల్పడ్డారని గద్దె అనురాధ విమర్శించారు. ఈసమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరిసిపోగు రాజేష్ ( దళిత రత్న ) తో పాటు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0