ఆపాత మధురం అలనాటి జ్ఞాపకాలు
ఆపాత మధురం అలనాటి జ్ఞాపకాలు
జగ్గయ్యపేట ఫిబ్రవరి 08 ,( వెలుగు నాడు ప్రతినిధి ) : జగ్గయ్యపేటలోని గెంటేల వెంకట జోగయ్య బాలుర హైస్కూల్ 1974-75 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ ప్రథమ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. దాదాపు 50 మంది మిత్రులు కుటుంబ సభ్యులతో హాజరై సందడి చేశారు.ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు.ఇప్పటి క్షేమ సమాచారాలు,స్థితిగతులను పంచుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాలకు మైకు సెట్ బహుకరించాలని,ప్రతి రెండేళ్లకోసారి కలవాలని తీర్మానించినట్లు పసుపుల పుల్లారావు తెలిపారు. హెచ్ఎం పివి నాగేశ్వరరావు వారిని అభినందించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0