రాజ్యాంగ స్పూర్తితో ముందుకెళ్లాలి టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ
రాజ్యాంగ స్పూర్తితో ముందుకెళ్లాలి టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ
ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడ,
జనవరి26,(వెలుగు నాడుప్రతినిధి): .ప్రాధమిక హక్కులు రాజ్యాంగం మనకు కల్పించిన ఆయుధాలని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గద్దె అనురాధ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం గద్దె అనురాధ మీడియా తో మాట్లాడుతూ ప్రాధమిక హక్కుల పునాదే రాజ్యాంగం మన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలు మూలస్తంబాలుగా అన్ని విధాలుగా ప్రజల అభివృద్దిని కోరుకునే సమున్నత ఆశయమే రాజ్యాంగమని వివరించారు. 76 సంవత్సరాల క్రితం ఇదే రోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, భారత దేశం ఒక స్వయం పరిపాలిత దేశంగా మారిందని అన్నారు. భారత దేశం విభన్న సంస్కృతితో కూడిన నిలయమన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన నినాదమంటూ దేశ ప్రజలకు వున్న ఈ హక్కులను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించినన రాజ్యాంగం కల్పించిందన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాజంలోని అసమానతలు పూర్తిగా తొలగించేందుకు , పేదల సంక్షేమం కోసం వివిధ సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయన్నారు.ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్ దేశ, రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోతెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్, ఏపీ బిల్డింగ్ & ఆదర్ కనష్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు , ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, రాష్ట్ర తెలుగు దేశం పార్టీ కార్యదర్శులు ఫిరోజ్, చెన్నుపాటి గాంధీ , టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజు, ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి దోమకొండ రవి, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బన్ కో ఆర్డినేటర్ వల్లభనేని నరసింహాచౌదరి, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి ఉషారాణి, ఉమ్మడి చంటి, వుడా మాజీ చైర్మన్ తుమాటి ప్రేమనాథ్ , 11వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాదేళ్ల రాజేష్, సెక్రటరీ మురళీ, వైస్ ప్రెసిడెంట్ వాసు, పశ్చిమ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు శివశర్మ, అజీజ్, పశ్చిమ నియోజకవర్గ నాయకులు షేక్ సుభానీ, కుప్పిలి నాగబాబు, సీనియర్ నాయకులు సత్తార్, కోగంటి రామారావు, టిడిపి నాయకులు ఇర్ఫాన్ , అబీద్ హుస్సెన్, మాదిగాని గురునాధం, గుమ్మడి కృష్ణరావు, కాకు మల్లికార్జున యాదవ్, టిడిపి మహిళ నాయకులు మాదాల రాజ్యలక్ష్మీ, కొలసాని నాగమణి, చెరుకూరి మాధవి లతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0