అంబేద్కర్ పేరుతో కమ్యూనిటీ హాల్ నిర్మించాలి ఎమ్మెల్యేకు టీడీపీ ఎస్సీ నాయకుల వినతిపత్రం

Feb 3, 2026 - 02:39
 0  3
అంబేద్కర్ పేరుతో కమ్యూనిటీ హాల్ నిర్మించాలి ఎమ్మెల్యేకు టీడీపీ ఎస్సీ నాయకుల వినతిపత్రం

అంబేద్కర్ పేరుతో కమ్యూనిటీ హాల్ నిర్మించాలి ఎమ్మెల్యేకు టీడీపీ ఎస్సీ నాయకుల వినతిపత్రం

జగ్గయ్యపేట ఫిబ్రవరి02 (వెలుగు నాడు ప్రతినిధి ) : జగ్గయ్యపేట పట్టణంలోని కాకాని నగర్ ప్రాంతంలో ఉన్న పాత సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల స్థలం ప్రస్తుతం నిరుపయోగంగా మారి శిథిలావస్థలోఉంది.ఈ స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్,బాబు జగజీవన్ రామ్ ల పేర్లతో ఒక ఆధునిక కమ్యూనిటీ హాల్‌ను నిర్మించాలని కోరుతూ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)ను వారి నివాసంలో కలిసి మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సీ సెల్ నాయకులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ద్వారా సామాజిక, సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ముఖ్యంగా ఎస్సీ వర్గాల ప్రజలకు ఇది ఒక శాశ్వత ఆస్తిగా నిలుస్తుందని తెలియజేశారు.అలాగే డాక్టర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ నిర్మాణం ఉండాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుని కమ్యూనిటీ హాలు నిర్మాణం కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్