బాధిత కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుంది ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
అమర్‌నాథ్ గౌడ్ హత్య అత్యంత దారుణం బాధిత కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుంది ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
హేమశ్రీ ఉన్నత విద్యకు పూర్తి బాధ్యత వహిస్తామని సీఎం చంద్రబాబు హామీ నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చర్యలు
నందిగామ జూన్ 16, (వెలుగు నాడు ప్రతినిధి) : నందిగామ పట్టణంలోని కాకాని నగర్ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించి, బీసీ (గౌడ) సామాజిక వర్గానికి చెందిన పదో తరగతి విద్యార్థి అమర్‌నాథ్ గౌడ్ దారుణ హత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన అక్కను వేధించిన వైసీపీ సానుభూతిపరుడిని ప్రశ్నించినందుకు అమర్‌నాథ్ గౌడ్‌పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం అమానుషమైన, హృదయ విదారక ఘటన అని పేర్కొన్నారు. సమాజాన్ని కలచివేసిన ఈ సంఘటనలో బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిందని తెలిపారు. అమర్‌నాథ్ గౌడ్ కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమర్‌నాథ్ సోదరి హేమశ్రీ ఉన్నత విద్యకు పూర్తి బాధ్యత వహిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయంతో పాటు దీర్ఘకాలిక భరోసా కల్పించడం ద్వారా టీడీపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించిందన్నారు.గతంలో బాధిత కుటుంబం ఎదుర్కొన్న అన్యాయానికి, ప్రస్తుతం టీడీపీ నాయకత్వంలో లభిస్తున్న అండకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను ఆ కుటుంబం వ్యక్తం చేసిన స్పందన ద్వారా ప్రజలు గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0