పోలీసులకు యూనిఫాం పంపిణీ చేసిన టిడిపి విక్రమ్ 

Jan 20, 2026 - 03:00
 0  15
పోలీసులకు యూనిఫాం పంపిణీ చేసిన టిడిపి విక్రమ్ 

పోలీసులకు యూనిఫాం పంపిణీ చేసిన టిడిపి విక్రమ్ 

నందిగామ, జనవరి 19, (వెలుగు నాడు ప్రతినిధి) : నందిగామ పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న పోలీస్ అధికారులకు సంక్రాంతి పండుగ సందర్భంగా నందిగామ మండల లింగాలపాడు వాస్తవ్యులు టిడిపి వైస్ ప్రెసిడెంట్ ఉమ్మనేని విక్రమ్ సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్ కార్యాలయం నందు గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పోలీస్ దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ శాంతిభద్రతలు కాపాడుతూ నిత్యం ప్రజా రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే పోలీసులకు పోలీస్ దుస్తులు అందించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. పోలీస్ యూనిఫాం పోలీస్ అధికారి యొక్క శ్రేణిని సూచిస్తుందని మరియు ప్రజలకు భద్రత భావాన్ని కలిగిస్తుందని, శాంతి, క్రమశిక్షణ, భద్రతకు గుర్తింపుని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నత అధికారులు ఉమ్మనేని విక్రమ్ కు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్