ఉపాధి గ్యారెంటీ లేని వి బి జి రామ్ జి ఉపాధి హామీ పథకం స్థానంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్నిపునరుద్దించాలి.

Jan 21, 2026 - 23:10
 0  1

జగ్గయ్యపేట, జనవరి21,(వెలుగు నాడు ప్రతినిధి) మండలంలోని షేర్ మొహమ్మద్ పేట గ్రామంలో బుధవారం మాత్మ గాంధీ జాతి ఉపాధి పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఉపాధి హామీ పోస్టర్ ను సిపిఎం పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చి ఉపాధి హామీ పథకాన్ని కార్పొరేట్లకి అప్పగించే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చిందని, కొత్త చట్టం వలన రాష్ట్రానికి అదనపు భారం మోపుతూ ఉందని, రాబోయే రోజుల్లో కొన్ని గ్రామాలకు ఉపాధి హామీ పథకం కూడా లేకుండా చేసే చట్టాలు చేస్తుందన్నారు. దీన్ని ఉపాధి హామీ పని చేసే కార్మికులందరూ అందరికీ పని కల్పించాలనే నినాదంతో ప్రజలందరూ చైతన్యంగా కలిగి కొత్త చట్టాన్ని వెనుకకు తీసుకునే విధంగా ప్రజలు చైతన్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోటా కృష్ణ దంతాల వెంకటేశ్వర్లు, కాకనబోయిన లింగారావు, కె వెంకటేశ్వరరావు, పుట్టం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్